స్వర్ణ ప్యాలెస్‌ దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరం

by srinivas |
స్వర్ణ ప్యాలెస్‌ దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరం
X

దిశ ఏపీ బ్యూరో: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై మూడు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా తీసుకున్న హోటల్ స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్‌లో ఒక బృందం తనిఖీలు చేస్తోంది. మరో బృందం షార్ట్ సర్క్యూట్‌ కారణాలపై తనిఖీలు చేస్తోంది. మూడో బృందం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయన్నదానిపై పరిశీలిస్తోంది.

స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్ సంబంధించి నిబంధనల ప్రకారం నిర్మాణ కొలతలు ఉన్నాయా..? లేదా..? అని పోలీస్, అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని జిల్లా కమిటీ బృందం పరిశీలించింది. సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, జిల్లా జాయిట్ కలెక్టర్ (అభివృద్ధి) శివ శంకర్, వీఎంసీ హెల్త్ ఆఫీసర్, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story