- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌కు షాక్.. మూడో టెస్టు ఆతిథ్య జట్టుదే
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ రసవత్తరంగా మారింది. తొలి టెస్టు డ్రా అయినప్పటికీ.. రెండో టెస్టులో భారత బౌలర్ల విజృంభన, బ్యాట్స్‌మాన్‌లు రాణించడంతో విరాట్ సేన విజయం సాధించింది. ఇక మూడో టెస్టులో ఆతిథ్య జట్టు తిరిగిపుంజుకుంది. భారత్‌పై సెకండ్ ఇన్నింగ్స్‌లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో 1-1 ఆధిక్యంలో ఇరు జట్లు కొనసాగుతున్నాయి.
మూడో టెస్టు సాగిందిలా..
మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దారుణంగా విఫలమైంది. ఓపెనర్ల నుంచి చివరి ఆటగాడి వరకు ఏ ఒక్కరు కూడా 20కి మించి వ్యక్తిగత పరుగులు చేయలేకపోయారు. రోహిత్ (19), రాహుల్ (0), పుజార(1), కోహ్లీ (7), రహనే(18), పంత్ (2) రవీంద్ర జడేజా(4), షమీ (0), ఇషాంత్ శర్మ (8 నాటౌట్), బుమ్రా(0), మహ్మద్ సిరాజ్ (3) అత్యల్ప స్కోర్ నమోదు చేయడంతో 40.4 ఓవర్లకు టీమిండియా 78 పరుగులకే కుప్పకూలింది.
ఇక అదే రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆతిథ్య జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఓపెనర్లు రోరి బర్న్స్ (61), హసీబ్ హమీద్ (68), మలన్(70) పరుగులతో శుభారంభం ఇచ్చారు. మిడిలార్డర్‌లో వచ్చిన రూట్ (121) తన స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. బెయిర్ స్టో (29), బట్లర్ (7), మొయిన్ అలీ (8), సామ్ కర్రన్ (15) క్రెయిగ్ ఓవర్టన్ (32), రాబిన్‌సన్(0), అండర్సన్(0 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 432 పరుగుల చేసింది.
ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. 278 పరుగులకే ఆలౌట్ కావడంతో విజయం ఇంగ్లాండ్ సొంతం అయింది. రోహిత్ (59), రాహుల్ (8), పుజార(91), కోహ్లీ (55), రహనే(10), పంత్ (1) రవీంద్ర జడేజా(30), షమీ (6), ఇషాంత్ శర్మ (2), బుమ్రా(1 నాటౌట్), మహ్మద్ సిరాజ్ (0) పరుగులు చేశారు. దీంతో విరాట్ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరగనుంది.