- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్ వన్ సైడ్ .. చిరకాల ప్రత్యర్థిపై ఇంగ్లాడ్‌దే విజయం
దిశ, స్పోర్ట్స్: T20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ మ్యాచ్‌లో వార్ వన్ సైడ్ అయిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ స్టార్టింగ్ నుండి ఆసీస్‌పై విరుచుకుపడింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఆసీస్ టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చడమే కాకుండా ఎక్కడా కూడా బ్యాటర్లకి అవకాశం లేకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44) మినహా వేరే బ్యాటర్లు క్రీజ్‌లో నిలువలేకపోయారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లల్లో ఆస్ట్రేలియా 125 పరుగులకే అల్ అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్ ఒక్కొక్కరు రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ పతనంలో కీలక పాత్ర పోషించారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ప్రారంభం నుంచే జోరు చూపించింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, జొస్ బట్లర్ కలిసి మొదటి వికెట్‌కి 66 పరుగుల భాగ్యస్వామ్యం నెలకొల్పారు. రాయ్ (22) పరుగులకే అవుట్ అయినా బట్లర్(71) దూకుడు బ్యాటింగ్ చేసి అజేయంగా నిలవడంతో కేవలం 12 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా మూడవ విజయం సాధించి దాదాపు సెమిస్‌కి చేరింది.