- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి టీ20 ఇంగ్లాండ్ మహిళలదే
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళా జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. చివరి వన్డేలో గెలుపుతో ఫామ్‌లోకి వచ్చిన భారత జట్టు టీ20 సిరీస్‌లో రాణిస్తుందని అందరూ భావించారు. కానీ వర్షం భారత జట్టు ఆశలను వమ్ము చేసింది. శుక్రవారం రాత్రి నార్తాంప్టన్ కౌంటీ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్, ఇండియా మహిళా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్ 18 పరుగుల తేడాతో డక్‌వర్త్ లూయీస్ పద్దతిలో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో ఓపెనర్లు డానిల్లీ వాట్, టామీ బ్యూమౌంట్ కలసి 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత నాట్ షివర్, ఆమీ జోన్స్ కలిసి 5వ వికెట్‌కు 78 పరుగులు జోడించారు. షివర్ 27 బంతుల్లో 55 పరుగులు బాదింది, ఇక ఆమీ జోన్స్ కూడా నాలుగు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో 43 పరుగులు చేసింది. ఆమీ జోన్స్ చివర్లో శిఖా పాండే బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి హర్లీన్ డియోల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు అవుటయ్యింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ మహిళలు 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.
178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మూడు కీలకమైన వికెట్లు మొదట్లోనే కోల్పోయింది. షెఫాలీ వర్మ డక్ అవుట్‌గా వెనుదిరిగింది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ కలసి రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. వీరిద్దరూ కుదురుకున్నట్లే కనిపించారు. అయితే షివర్ బౌలింగ్‌లో మంధాన (29) అవుటయ్యింది. హర్మన్ ప్రీత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయింది. అనవసరమై పరుగు కోసం ప్రయత్నించి అవుటయ్యింది. భారత జట్టు 8.4 ఓవర్లలో 54 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో డక్ వర్త్ లూయీస్ పద్దతిలో 18 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచినట్లు ప్రకటించారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 1-0 తేడాతో టీ20 సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇంగ్లాండ స్కోర్ – 177/7 (20ఓవర్లు) (నాట్ షివర్ 55, ఆమీ జోన్స్ 43)
ఇండియా స్కోర్ – 54/3 (8.4 ఓవర్లు)(స్మృతి మంధాన 29, హర్లీన్ డియోల్ 17 నాటౌట్)