- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏడేళ్ల తర్వాత టెస్టు.. గెలుపు ఎవరిదో?
దిశ, స్పోర్ట్స్: కోహ్లీ సేనతో పాటు ఇంగ్లాండ్ వెళ్లిన ఇండియా మహిళా జట్టు ఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. ఇంగ్లాండ్ మహిళా జట్టుతో బుధవారం నుంచి బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. భారత జట్టు చివరి సారిగా 2014లో మైసూర్ వేదికగా సౌతాఫ్రికా జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఏడేళ్లకు ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుండటం గమనార్హం. భారత జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లోనూ విజయం సాధించింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆడిన టెస్టు కంటే ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 2006, 2014లో ఆడిన రెండు టెస్టుల్లో టీమ్ ఇండియా గెలిచింది. ఇంగ్లాండ్ జట్టు తమ సొంత గడ్డపై 8 టెస్టులు ఆడగా ఇంత వరకు టీమ్ ఇండియా మహిళలపై ఒక్కసారి కూడా గెలవలేదు. 2014లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో కెప్టెన్ మిథాలీ రాజ్, స్మృతి మంధాన అర్దసెంచరీలు సాధించగా, జులన్ గోస్వామి 5 వికెట్లు తీసింది. ఈ టెస్టులో ఇండియా తరపున మొత్తం 8 మంది క్రికెటర్లు అరంగేట్రం చేయడం విశేషం. ఇక ఇప్పటికే వరుసగా మూడు టెస్టులు గెలిచిన టీమ్ ఇండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే రికార్డు సృష్టించే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు వరుసగా మూడు టెస్టులు గెలిచి ఆసీస్, ఇండియా సమానంగా నిలిచాయి. ఈ టెస్టు గెలిస్తే టీమ్ ఇండియా వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన ఏకైక జట్టుగా నిలుస్తుంది. భారత జట్టు సమతూకంగా కనిపిస్తున్నా బ్రిస్టల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత సులభమేమీ కాదు. టీమ్ ఇండియా గత ఏడేళ్లుగా ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ఇంగ్లాండ్ మహిళా జట్టు మాత్రం ఆస్ట్రేలియాతో యాషెస్ ఆడుతూ మంచి అనుభవం సంపాదించింది. ఇంగ్లాండ్ మహిళా జట్టును ఎదుర్కోవాలంటే మిథాలీ సేన కష్టపడాల్సిందే.
ఇండియా (అంచనా) : మిథాలీ రాజ్ (కెప్టెన్), తానియా భాటియా (వికెట్ కీపర్), స్మృతి మంధాన, ప్రియ పూనియా, పూనమ్ రౌత్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, బిస్త్, పూనమ్ యాదవ్
ఇంగ్లాండ్ (అంచనా) : హీథర్ నైట్ (కెప్టెన్), ఆమీ జోన్స్ (వికెట్ కీపర్), టామీ బ్యూమౌంట్, లారెన్ విన్‌ఫీల్డ్, నతాలీ షివర్, సోఫియా డంక్లే, ఫ్రాన్ విల్సన్, కేథరిన్ బ్రంట్, జార్జియా ఎల్విస్, సోషియా ఎక్లిస్‌స్టోన్, అన్య ష్రబ్‌సోలో
మ్యాచ్ : ఏకైక టెస్ట్
వేదిక : బ్రిస్టల్ కౌంటీ స్టేడియం
సమయం : మధ్యాహ్నం 3.30
లైవ్ : సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్. సోనీ లివ్