- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ x పాకిస్తాన్ సిరీస్ విండీస్‌లో ?
కరోనా దెబ్బకు క్రీడారంగం సంక్షోభంలో కూరుకుపోయింది. మెగా టోర్నీలు వాయిదా పడగా.. కొన్ని రద్దయ్యాయి. తాజాగా జూన్ 4వ తేదీ నుంచి వెస్టిండీస్ – ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ వాయిదా పడేలా ఉంది. యూరోప్‌లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సిరీస్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేయాలని, అదీ వీలుకాకపోతే.. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం వేదికలను కరీబియన్ దీవులకు మార్చాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నారు. ఇదే విషయంపై ఇంగ్లాండ్, వెస్టిండిస్, వేల్స్ క్రికెట్ బోర్డులు గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నాయి. కానీ దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. మరోవైపు జులై 30 నుంచి పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లను కూడా కరేబియన్ దీవులకు తరలించే ఆలోచన చేస్తున్నారు. ఈ విషయంపై విండీస్ క్రికెట్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్ స్పందిస్తూ.. సిరీస్ షెడ్యూల్ మార్పు, వేదికల తరలింపు ప్రక్రియపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారిసన్‌తో మాట్లాడానని చెప్పారు. ఈ విషయంలో విండీస్ క్రికెట్ బోర్డు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
Tags: England, Pakistan, Test Series, Caribbean islands, West Indies Cricket Board