పందెంకోడి డైరెక్టర్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’

by Jakkula Samataha |
energitic star ram
X

దిశ, సినిమా: ఇటీవలే కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వచ్చిన ‘రెడ్’ సినిమాతో అలరించిన రామ్ పోతినేని.. తాజాగా మరో పవర్‌పుల్ కాంబినేషన్‌కు ఓకే చెప్పాడు. తనకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఉస్తాద్ రామ్‌గా సెపరేట్ మాస్ ఫాలోయింగ్ ఏర్పడగా.. ఇప్పుడు ఆ ఇమేజ్‌‌ను రెట్టింపు చేసేలా తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో బైలింగువల్ ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు రామ్. తమిళ్‌లో ‘రన్, పందెంకోడి, ఆవారా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న లింగుస్వామితో రామ్ తదుపరి సినిమా చేస్తున్నట్టుగా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మేరకు డైరెక్టర్ లింగుస్వామి ట్విట్టర్ వేదికగా #Rapo19 ప్రకటించారు. ఎస్ఎస్. స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రామ్‌కు ఇది 19వ చిత్రం కానుంది. కాగా ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కనుంది. ఇక హీరోయిన్‌తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.

Advertisement

Next Story