- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏవోబీలో గుర్తు తెలియని మావోయిస్టు మృతి
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రా – ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఆదివారం మావోలకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని మావోయిస్టు మృతిచెందగా, 15 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ వివరాల ప్రకారం.. ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా ఖైర్‌పుట్ బ్లాక్ మత్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని మడక్‌పొదర్ సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒడిశాకు చెందిన డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు జల్లెడ పట్టాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల కదలికలు గమనించిన మావోలు కాల్పులు జరిపారు. సుమారు 45 నిముషాలపాటు పోలీసులకు మావోల మధ్య కాల్పులు జరిగాయి. మావోల నుంచి ఫైరింగ్ ఆగిపోయాక పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించారు. ఓ గుర్తుతెలియని మావోయిస్టు మృత దేహం లభించింది. ఓ పిస్టల్, దేశీయ గన్, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంట పాత్రలతో పాటు మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.