వారంలో ఒక్కరోజు ఆఫీసుకు రండి : HCL

by Harish |
వారంలో ఒక్కరోజు ఆఫీసుకు రండి : HCL
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ప్రకటించిన HCL సంస్థ తాజాగా ఓ ప్రకటన చేసింది. తమ ఉద్యోగులు వారంలో ఒక్కరోజు అయినా ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించింది. ఈ విధానం డిసెంబర్ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రస్తుతం 5 నుంచి 6 శాతం సిబ్బందితో ఆఫీసులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ..డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 20 శాతానికి పెంచనున్నట్లు తెలిపింది. ఐదేండ్ల లోపు పిల్లలు ఉన్న ఉద్యోగులు, 50 ఏళ్ల పైబడిన తల్లిదండ్రులను చూసుకునే వారు మాత్రం ఇంటి నుంచి పనిచేసుకోవచ్చునని స్పష్టంచేసింది.

Advertisement

Next Story