- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్యూనిటీ స్థలాన్ని అమ్మిన సెక్రటరీ..లేనిది ఉన్నదిగా చూపుతూ రిజిస్ట్రేషన్..
దిశ, శేరిలింగంపల్లి: కాలనీల ఏర్పాటు జరిగినప్పుడు పిల్లలకు ఆటస్థలాలు, పార్కులు, లైబ్రెరీ ఇతర సౌకర్యాల కోసం స్థలాలను వదలడం తప్పనిసరి. ఇలాంటి స్థలాలు నగరంలోని ప్రతి కాలనీలో ఉంటాయి. కానీ ఇప్పుడు అవి క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఎమ్యూనిటీ ప్లేస్‌లలో సొసైటీ భవనాలు వెలుస్తున్నాయి. ఇంకొన్ని కాలనీల్లో సొసైటీ స్థలాలు అందులోని సభ్యులకు వరంగా మారాయి. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు తహతహలాడుతున్నారు నాయకులు. సొసైటీ స్థలాలను అన్యాక్రాంతం చేయడం, తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు సాగించడం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల సొసైటీ సభ్యులకు సర్వసాధారణంగా మారింది.
ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. చందానగర్‌లోని ఓ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సొసైటీ అధ్యక్షుడు చదును చేయిస్తున్నామంటూ తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్‌లో ఓ కాలనీ అధ్యక్షుడు అందులో ఏకంగా ఎమ్యూనిటీ హాల్ నిర్మాణమే చేపట్టారు. తాజాగా అదే హైదర్ నగర్ డివిజన్‌లో మరో సొసైటీ నాయకుడు కాలనీ సౌకర్యాల కోసం వదిలిన స్థలాన్ని లేని నెంబర్ చూపించి అమ్మకాలు సాగించారు.
భాగ్యనగర్ సొసైటీ
కూకట్ పల్లి నడిబొడ్డున ఉన్న భాగ్యనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ స్థలాన్ని రాత్రికి రాత్రే అమ్మేశారు ఆ సొసైటీ నాయకుడు. పాల నర్సింహ్మారెడ్డి అనే వ్యక్తి భూమిలో 1980 దశకంలో సర్వేనెంబర్ 180, 197, 200 లోని 30 ఎకరాల్లో ఏర్పాటైన ఈ కాలనీ రెండు అసోసియేషన్‌లుగా ఏర్పడింది. అందులో ఒకటి భాగ్యనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాగా మరోటి సమతా నగర్ హౌసింగ్ సొసైటీ. ఇందులో భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీలో మొత్తం 357 ప్లాట్స్ ఉండగా అందులో చాలామంది ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఈ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని స్థలాల్లో సౌకర్యాల కల్పనకు గాను లే అవుట్ ప్రకారం మొత్తం 6 చోట్ల ఎమ్యూనిటీస్ కోసం స్థలాలు వదిలారు. అందులో ఇప్పటికే కొన్ని ఎమ్యూనిటీస్ స్థలాలు కబ్జాలకు గురికాగా, ఇంకొన్నిటిని కొందరు సొసైటీ నాయకులు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఇదీ విషయం..
భాగ్యనగర్ కాలనీ రోడ్డు నెంబర్ 33లో 2180 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఉండగా అందులో ఒక వంద గజాల స్థలంలో కాలనీ వాసులు లైబ్రెరీ ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మరో వర్గం కోర్టుకు వెళ్లినా కాలనీ వాసులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. మిగతా స్థలంలో ఓ సెప్టిక్ ట్యాంక్, కాలనీ నుండి వచ్చే వరద నీరు వెళ్లే కాలువ, డ్రైనేజీ లైన్ ఉంది. అయితే లైబ్రెరీ పక్కనే ఉన్న స్థలం తమదే అంటూ ఇటీవల ఓ వ్యక్తి డాక్యుమెంట్లతో వచ్చి ఆ స్థలం కబ్జా చేసేందుకు చూస్తున్నాడని కాలనీ వాసులు చెబుతున్నారు. పలుమార్లు గోడ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశారని, అది కాలనీ ఎమ్యూనిటీస్ కోసం వదిలిన స్థలమని అందులో ఎలా నిర్మాణాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు కాలనీ వాసులు.
ఆ స్థలం ఎవరిది..
కాలనీ లే అవుట్ ప్రకారం అందులో ఉన్న ప్లాట్ల సంఖ్య 357 మాత్రమే. ఇవి పోను ఎమ్యూనిటీస్ కోసం ఒకచోట 1010.4 స్క్వేర్ యార్డ్స్, మరోచోట 2322.17 స్క్వేర్ యార్డ్స్, 7999 స్క్వేర్ యార్డ్స్, 2180 స్క్వేర్ యార్డ్స్, 860 స్క్వేర్ యార్డ్స్, 1209 స్క్వేర్ యార్డ్స్ వదిలారు. మొత్తంగా ఈ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీలో 10శాతం అంటే 17653.9 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని కేవలం సౌకర్యాల కల్పనకు వదిలారు. కానీ ఇందులో చాలా స్థలాలు ఇప్పుడు ఎవరో ఒకరి చేతుల్లో ఉన్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న 2180 స్క్వేర్ యార్డ్స్ స్థలంలో కూడా వెంకటరాజు అనే వ్యక్తి ప్లాట్ నెంబర్ 361గా పేర్కొంటూ 127.77 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని 09 జులై 2013లో డాక్యుమెంట్ నెంబర్ 5008, 2013(1) ఆఫ్ ఎస్ ఆర్ ఓ కూకట్ పల్లి (1511)తో ఎం. వెంకటరాజు మాజీ భాగ్యనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సెక్రటరీ, జె. లక్ష్మణరావు కమిటీ ఎక్స్ మెంబర్ లు ఆయల సోమయాజుల వెంకట రామారావుకు అమ్మినట్లు పేర్కొన్నారు. అయితే లే అవుట్ ప్రకారం కేవలం 357 ప్లాట్స్ మాత్రమే ఉండగా కొత్తగా ఈ 361 ప్లాట్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు కాలనీ వాసులు.
అది పక్కాగా ఎమ్యూనిటీ స్థలమే..
కాలనీ సౌకర్యాల కోసం వదిలిన స్థలాన్ని మాజీ సెక్రటరీ మరొకరికి అమ్మినట్లు చెబుతున్నారు. ఇది పక్కాగా సొసైటీ స్థలమే అందులో ఎవరూ నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు. స్థలం కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తులను, దాన్ని వేరే వారిపైన రిజిస్ట్రేషన్ చేసిన వారిపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి.