హాట్ సీట్‌లో సమంత.. భయంగా ఉందంటూ కామెంట్

by Shyam |   ( Updated:2021-10-10 04:33:59.0  )
హాట్ సీట్‌లో సమంత.. భయంగా ఉందంటూ కామెంట్
X

దిశ, సినిమా : నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత యాక్ట్రెస్ సమంత పబ్లిక్‌ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించలేదు. కాగా మొదటిసారి ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షోకు గెస్ట్‌‌గా కనిపించనుంది. నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్‌కు సమంత గెస్ట్‌గా హాజరైన ప్రోమోను బ్రాడ్‌కాస్టర్ జెమిని టీవీ తాజాగా టెలికాస్ట్ చేయగా.. ఫుల్ ఫన్‌తో కూడిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌తో సామ్ ఇప్పటికే మూడు సినిమాల్లో నటించగా.. ఆ స్పెషల్ బాండింగ్ ఈ ఎపిసోడ్‌లో ఫన్ జెనరేట్ చేసేందుకు కారణమైంది. ఇక షోలో భాగంగా హాట్ సీట్‌లో కూర్చున్న సమంత.. కొంచెం భయంగా ఉందంటూ తన ఫీలింగ్‌ను తారక్‌తో షేర్ చేసుకుంది. ఇంతకుముందు ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్టులుగా హాజరు కాగా.. త్వరలోనే మహేశ్ బాబు స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని సమాచారం. సామ్ సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ ఎపిక్ ‘శాకుంతలం’లో షూటింగ్ కంప్లీట్ చేసింది.

Advertisement

Next Story