అత్యవసర సేవల వాహనాలు ప్రారంభం

by srinivas |
అత్యవసర సేవల వాహనాలు ప్రారంభం
X

దిశ, ఏపీబ్యూరో : విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, అత్యవసర పోలీసు సేవల కోసం మరో 36 వాహనాలను సీఎం జగన్​ ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్లో వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 14 డిజాస్టర్ రెస్పాన్స్, రెస్క్యూ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలను పోలీసు శాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి త్వరలోనే పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా, 20 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్టయి ఉంటాయి. వీటి ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీసు శాఖ సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది.

Advertisement

Next Story