- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిప్పంటించిన టైరుతో ఏనుగు కిల్లింగ్!
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో అటవీ జంతువులు దారుణంగా హత్యకు గురవుతున్నాయి. మనుషులు మృగాలుగా మారి పైశాచిక ఆనందం కోసం మూగజీవులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలంలో కేరళ, తమిళ నాడులో ఆవులు, ఏనుగులకు తినే ఆహారంలో నాటు బాంబులు పెట్టి వాటి మరణానికి కారణమయ్యారు. ఇలాంటి ఘటనలు దేశంలోని పలుచోట్ల వెలుగులోకి రాగా, కేంద్రం చర్యలతో కొద్దిగా సర్దుమణిగాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనే తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో మరొకటి వెలుగుచూసింది.
40 ఏళ్ల వయస్సు ఉన్న ఏనుగు మీద నిప్పంటించిన టైరును వేసి దాని మరణానికి కారణమయ్యారు. ప్రైవేటు రిసార్టులో పనిచేస్తున్న ఓ వ్యక్తి కాలుతున్న టైరును ఏనుగు మీదకు విసిరాడు. అది కాస్త దాని చెవికి చిక్కుకుంది. వేడి తీవ్రతకు తట్టుకోలేకపోయిన ఏనుగు వెంటనే అటవీలోనికి పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు దానిని అనుసరిస్తూ వెళ్లారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఏనుగు మరణించినట్లు వారు నిర్దారించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అటవీ శాఖ సిబ్బంది రిసార్టు ఓనర్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.