భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం..

by Anukaran |
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం..
X

దిశ, వెబ్‌డెస్క్: భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విప్లవం రాబోతోందని ప్రముఖ క్యాబ్ షేరింగ్ దిగ్గజ సంస్థ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరకే తీసుకొచ్చేందుకు పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై భవిష్ అగర్వాల తన అభిప్రాయలను వ్యక్తం చేశారు. 2017లో మొట్టమొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈవీ చర్యల నుంచి గతవారం గుజరాత్ ఈవీ-2021 పాలసీని ఆమోదించింది. దీంతో మొత్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరకు వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

‘ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ రానున్న రోజుల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వీలైనంత తొందరగా తెచ్చే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని’ భవిష్ అగర్వాల స్పష్టం చేశారు. తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ-2021ని ఆమోదించింది. దీనివల్ల రానున్న 4 ఏళ్లలో కనీసం 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపై తీసుకురావడం ఈ పాలసీ లక్ష్యం. దీని కోసం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ. 20 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు సబ్సీడీలను అందించనుంది. ఈ నేపథ్యంలో భవిష్ అగర్వాల రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story