దుబ్బాక ఎఫెక్ట్.. హుజురాబాద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా.?

by Anukaran |
EC, Huzurabad by-election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉప ఎన్నికలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారుల బృందాన్ని కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్‌కు పంపనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారులను బై పోల్స్ పర్యవేక్షణ కోసం పంపించనున్నారు. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆందోళనలు చోటు చేసుకోవడంతో పాటు ఫిర్యాదులు కూడా వెళ్లడంతో సీఈసీ ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాల్సి వచ్చింది.

హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వెళ్లిన ఈ కంప్లైంట్లను పరిగణనలోకి తీసుకున్న సీఈసీ స్పెషల్ టీంను క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో పాటు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed