అక్టోబర్ లోనే దుబ్బాక ఉపఎన్నిక!

by Shamantha N |   ( Updated:2020-09-04 06:42:06.0  )
అక్టోబర్ లోనే దుబ్బాక ఉపఎన్నిక!
X

దిశ వెబ్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసన సభ, పార్లమెంట్ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవి కాలం నవంబర్ నెలలో ముగియనుంది. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అక్టోబర్, నవంబర్ లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కాగా బలగాల మోహరింపు, ఇతర కారాణాలను దృష్టిలో పెట్టుకుని బీహార్ తోపాటే దేశంలోని మిగతా స్థానాలకు కూడా ఓకే సారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటదన్న నిర్ణయానికి ఎన్నికల సంఘం వచ్చింది.

ఇక బీహార్ తో పాటే తెలంగాణలోని దుబ్బాకకు కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇటీవల గుండె జబ్బుతో దుబ్బాక ఎమ్మెల్యే సోలీపేట రామలింగా రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

Advertisement

Next Story