- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటింటి ప్రచారానికి ఐదుగురే : ఈసీ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక ప్రపంచ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఈ మహమ్మారి వలన మన దేశంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు ఎన్నికల నిబంధనల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడున్న నిబంధనలకు తోడు కేంద్ర ఎన్నికల సంఘం మరికొన్ని నూతన నిబంధనలను తీసుకొచ్చింది.
ఎన్నికల వేళ ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించరాదని ఈసీ స్పష్టంచేసింది. ఓటు వేసే సమయంలో ఓటర్లు సామాజిక దూరాన్ని తప్పక పాటించాలని సూచించింది. ఓటర్లందరికీ చేతి గ్లవ్స్ ఇవ్వాలని… ప్రతి ఓటరూ గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్ నొక్కాలని వెల్లడించిది. కేంద్ర ప్రభుత్వం విధించిన కొవిడ్-19 నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని పేర్కొంది. పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని.. అయితే, కేంద్ర హోంశాఖ విధించిన కొవిడ్-19 నిబంధనలు మాత్రం తప్పపనిసరి అని ఆదేశించింది.
అభ్యర్థులందరూ నామినేషన్లను ఆన్ లైన్లో దాఖలు చేయాలని ఈసీ ప్రకటించింది. సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా ఆన్ లైన్లోనే చెల్లించాలని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో మాస్కులు, శానిటైజర్లు ఉండాలని, థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.