‘రాజా.. మీకిదే శిక్ష.. 48 గంటలు అది చేయకూడదు’

by Shamantha N |
Raja
X

చెన్నై : కేంద్ర మాజీ మంత్రి, ద్రవిడ మున్నెట్ర కజగం (డీఎంకే) నాయకుడు ఎ. రాజాపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కొరడా విధించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను రెండు రోజుల పాటు (48 గంటలు) ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. పళనిస్వామి తల్లిపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో డీఎంకే అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన రాజా మాట్లాడుతూ… ‘స్టాలిన్ కాలి చెప్పు విలువకు కూడా నువ్వు (పళనిస్వామి) పనికిరావు. ఆయనకు సవాల్ విసిరే స్థాయా నీది..? పెళ్లి తర్వాత తొమ్మిదినెలలకు సరైన పద్ధతిలో స్టాలిన్ జన్మిస్తే పళనిస్వామి మాత్రం ప్రీ మెచ్యూర్ బెబీ. ఆయన అకాల శిశువు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారమే రేపాయి. రాజా చేసిన ఈ వ్యాఖ్యలకు సీఎం కన్నీరు పెట్టుకున్నారు. తన తల్లిపై వ్యాఖ్యలు చేసిన వారిని దేవుడే శిక్షిస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజా చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఆయనపై చర్యలు తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed