- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధిపేటలో టీఆర్ఎస్ టార్గెట్‌కు బ్రేక్..!!
దిశ ప్రతినిధి, మెదక్ : ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. మార్చి 14 న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోకి సిద్దిపేట జిల్లాకు చెందిన నాలుగు మండలాలు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి వస్తాయి. దీంతో మళ్లీ సిద్దిపేట జిల్లాకు ఎన్నికల కోడ్ వర్తించనుంది. ఎన్నికల కోడ్ అమలైతే జిల్లాలో ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉండదు, ఫలితంగా సిద్దిపేట అభివృద్ధికి బ్రేక్ పడే అవకాశం ఉంది. అంతేగాకుండా ఇటీవల టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా బ్రేక్ పడే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
వరుస కోడ్‌లు..
సిద్దిపేట జిల్లా అభివృద్ధికి వరుసగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారుతుంది. మొన్నటి వరకు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు అడ్డురాగా, ఇప్పుడు వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో మరోసారి జిల్లాకు ఎన్నికల కోడ్ అమలు కానుంది. జిల్లాలోని కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి వస్తాయి.
పనులకు బ్రేక్..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతంలో ఎలాంటి నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. అలాగే ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నికలు జరిగే ప్రాంతంలో సభ్యత్వ నమోదును కొనసాగిస్తే ప్రతిపక్షాలు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి తరుణంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను సిద్దిపేట జిల్లాలో ఖచ్చితంగా బ్రేక్ పడాల్సిందే. అయితే, అధికార టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కొనసాగిస్తుందో లేదో చూడాలి మరి.
ప్రచారంలో ఆశావాహులు ..
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటికే అధికార పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములునాయక్, టీజేఎస్ నుంచి కోదండరాం, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నతో పాటు మరికొంత మంది ఆశావాహులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఓ దఫా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, తదితర మండలాల్లో ప్రచారం నిర్వహించారు.
అధికారుల సన్నద్ధం..
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 14న ఉన్నందున సిద్దిపేట జిల్లా అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. పట్టభద్రుల ఎన్నిక కోసం ప్రతీ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి శనివారం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిలాఖాన్ మద్దూరు, కొమురవెల్లి మండల కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు.