ఛీ.. ఛీ.. వీడు మనిషేనా.. ఒంటరిగా ఉన్న కుక్కను కూడా వదలలేదు

by Sumithra |   ( Updated:2021-10-03 05:18:49.0  )
ఛీ.. ఛీ.. వీడు మనిషేనా..  ఒంటరిగా ఉన్న కుక్కను కూడా వదలలేదు
X

దిశ, వెబ్‌డెస్క్ : కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మరచి మృగాళ్లలాగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులపైన అత్యాచారాలు చేస్తున్న ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. కానీ మూగజీవాలను సైతం వదలట్లేదు ఈ నీచులు. తాజాగా ఓ ఆడ కుక్కపై వృద్ధుడు లైగిదాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. పెంపుడు ఆడ కుక్కుపై అత్యాచారం చేసిన ఘటన హర్యానాలోని గురుగావ్‌‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే..దగ్గరగా ఇళ్లున్నవారికి చాలా వరకు స్నేహం ఉంటుంది. అయితే సురేష్(67) , ముఖేష్ అనే ఇద్దరు వ్యక్తులవి ఎదురెదురు ఇళ్లులు. వీరు ఎప్పుడు కలసి, మెలసి ఓ బంధువుల్లా ఉండేవారు. అయితే ముఖేష్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. దీంతో అతను ఓ ఆడకుక్కను, రెండు మగ కుక్కలను పెంచుకుంటున్నాడు. ముఖేష్ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లే సురేష్ అనే వృద్ధుడి కళ్లు ఆడ కుక్కమీద పడినవి. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సురేష్ కుక్కను తన ఇంటికి తీసుకచ్చుకొని ఆత్యాచారం చేశాడు. ఈ దృశ్యాన్ని ముఖేష్ చూసి, తన సెల్ ఫోన్‌లో వీడియో తీయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ముఖేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story