తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న

by Aamani |
తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న
X

దిశ, ఖానాపూర్ : ఇద్దరు అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాల్సింది పోయి చిన్న చిన్న విషయాలకే గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన అన్న తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్‌‌లో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. బొంగోని రాము, బొంగోని లక్ష్మన్ ఇద్దరు అన్నదమ్ములు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ పెయింటర్స్. గత నెల రోజుల కిందట ఇద్దరు గొడవ పడ్డారు. ఆ సమయంలో మృతుడు తన అన్న రామును గాయపరిచాడు.

ఈ క్రమంలోనే గొడవలు పెట్టుకోవద్దని కుటుంబ సభ్యులు వారికి సూచించారు. మృతుని భార్య మంజులా ఆరోగ్యం బాలేక వారి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుంది. మృతుడు తన నానమ్మ వద్ద ఉంటున్నాడు.ఈ నేపథ్యంలోనే రాము నానమ్మతో గొడవకు దిగాడు. ఎందుకు గొడవ అని తమ్ముడు ప్రశ్నించగా, పాత గొడవను మనసులో పెట్టుకున్న అన్న ఇంట్లో ఉన్న గొడ్డలితో తమ్ముని తలపై ఎడమవైపు నరికాడు. దీంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు వున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్, ఎస్‌ఐ రాము తెలిపారు.

Advertisement

Next Story