సూపర్ ఉమన్ : బాక్సర్.. బైకర్.. పోలీస్‌.. మోడల్

by Shyam |
సూపర్ ఉమన్ : బాక్సర్.. బైకర్.. పోలీస్‌.. మోడల్
X

దిశ, ఫీచర్స్ : ఒక అమ్మాయి.. స్టీరియోటైపిక్ సొసైటీలో పాతుకుపోయిన హద్దుల్ని చెరిపేస్తూ ఎదగడమంటే మామాలు విషయం కాదు. అలాంటిది మల్టిపుల్ ప్రొఫెషన్స్‌లో రాణించడమంటే అసలే సాధ్యం కాదు. కానీ సిక్కింకు చెందిన ఈక్షా హంగ్మా సుబ్బ అనే యువతి ఆ భావనలన్నీ తప్పని నిరూపిస్తోంది. ఈ 21 ఏళ్ల పోలీస్ ఆఫీసర్.. సూపర్ మోడల్‌, బాక్సర్‌, బైకర్‌గానూ రాణిస్తూ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది.

డేర్ టు డ్రీమ్ యాటిట్యూడ్..

రుంబుక్ గ్రామంలో ఐతరాజ్, సుక్రాణి సుబ్బ దంపతులకు జన్మించిన ఈక్షా.. తన కలలు, ఆసక్తులను అమితంగా ప్రేమించింది. రియాలిటీ టెలివిజన్ షో ‘MTV సూపర్‌మోడల్ ఆఫ్ ది ఇయర్’లో పార్టిసిపేట్ చేయాలని ఎప్పుడూ కోరుకునే తను.. చిన్న వయసులోనే లోకల్‌గా బాక్సింగ్ క్లాస్‌లో చేరి క్రీడల్లోనూ పోరాట పటిమను ప్రదర్శించింది. ధైర్యంగా కలలు కనాలనే ఆమె వైఖరిపై నమ్మకముంచిన తండ్రి తనను విజయం దిశగా ప్రోత్సహిస్తూ, ఫిట్‌నెస్‌ కాపాడుకునేందుకు బాక్సింగ్‌ మంచి మార్గమని సూచించాడు. తండ్రి మద్దతుతో ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈక్షా.. ఎంచుకున్న ప్రతీ రంగంలో రాణించేందుకు కృషి చేసి, బాక్సింగ్‌లో తన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది.

జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్న తనకు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే 19 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకుని సిక్కిం పోలీస్ ఫోర్స్‌లో చేరింది. ఓవైపు పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే MTV షో కోసం ఆడిషన్‌లో పాల్గొని ఎంపికైంది. ప్రస్తుతం రెండో సీజన్‌లోఉన్న ఈ కార్యక్రమం ‘Unapologetically You’ అనే థీమ్‌పై ప్రసారమవుతోంది. దీని కోసం ముంబై వెళ్లిన తనకు హిందీ రాకపోవడం, ఇండస్ట్రీ అనుభవం లేకపోవడం వంటివి ప్రతికూలతలుగా మారినా.. డిఫెన్స్ బ్యాక్‌గ్రౌండ్‌‌కు తోడు ఆత్మవిశ్వాసం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో షోలో పాల్గొంటోంది. ఈ మేరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో చాలా మంది హృదయాలను గెలుచుకున్న ఈక్షా.. ప్రస్తుతం ఈ షోలోని టాప్ ఫోర్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఉంది.

మల్టిపుల్ టాలెంట్స్‌తో దేశానికి పేరు తీసుకొచ్చే మహిళగా షో జడ్జెస్‌లో ఒకరైన మలైకా అరోరా నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు ఈక్షా ప్రయత్నాలను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

Advertisement

Next Story