మరోసారి చరిత్ర సృష్టించిన ఎనిమిదేళ్ల భువన్.. ఈసారి ఏకంగా అదే టార్గెట్ గా

by Shyam |   ( Updated:2021-09-21 02:56:24.0  )
మరోసారి చరిత్ర సృష్టించిన ఎనిమిదేళ్ల భువన్.. ఈసారి ఏకంగా అదే టార్గెట్ గా
X

దిశ, ఫీచర్స్: ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు.. తన సర్వీస్‌తో పేదల గుండెల చెరగని స్థానాన్ని ఏర్పరుచుకోగా, తండ్రికి తగ్గ తనయుడిగా గంధం భువన్ జై సాహస కృత్యాలతో ఆయన పేరును నిలబెడుతున్నాడు. లఢక్‌లో అతి ఎత్తయిన ఖర్దుంగ్ లా శిఖరాన్ని అధిరోహించిన ఎనిమిదేళ్ల భువన్.. ఈసారి ఐరోపా ఖండంలో అతిపెద్ద పర్వత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించి మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

కర్నూలు నివాసి గంధం భువన్ జై.. 5,642 మీటర్లు ఎత్తయిన ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించి, భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆపై బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కలిగి ఉన్న బ్యానర్‌ను ఆవిష్కరించాడు. ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అనంతపుర పర్వతారోహకుడు శంకరయ్య, భువన్‌కు శిక్షణ అందించాడు.

అనూహ్య వాతావరణం సహా అత్యధిక ఎత్తు కలిగిన మౌంట్ ఎల్బ్రస్ ఎక్కడం పర్వాతరోహకులకు ఎప్పుడూ సవాలే. తీవ్రమైన శారీరక ఒత్తిడితో కూడుకున్న ఈ సాహోసపేతమైన యాత్రను భువన్ దిగ్విజయంగా పూర్తిచేయడం ప్రశంసనీయమని శంకరయ్య తెలిపాడు. ఈ యాత్ర బృందంలో శంకరయ్య, నవీన్ మల్లేష్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్ భూపతి, రాజు వర్మ ఉన్నారు. ఈ సంవత్సరం మేలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఈ టీమ్. ప్రోత్సాహం అందించినందుకు తన తల్లిదండ్రులు, కోచ్‌లకు భువన్ జై కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే అవకాశం లభిస్తే ఇంకా చాలా మంది పిల్లలు అలాంటి విజయాలు సాధించగలరని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed