డిసెంబర్‌లోనూ కీలక రంగాల ఉత్పత్తి డౌన్!

by Harish |
డిసెంబర్‌లోనూ కీలక రంగాల ఉత్పత్తి డౌన్!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 డిసెంబర్ నెలకు సంబంధించి ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వరుసగా మూడో నెలా క్షీణించింది. సమీక్షించిన నెలలో ఈ రంగాల ఉత్పత్తి 1.3 శాతం పడిపోయింది. ముఖ్యంగా మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో అధిక వాటా కలిగిన ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, సహజవాయువు, ఉక్కు, సిమెంట్, ఎరువుల రంగాలు పేలవమైన ప్రదర్శన కారణంగా ప్రతికూల వృద్ధి నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ 3.1 శాతం సానుకూల వృద్ధిని సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన కీలక రంగాల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ నెలలో విద్యుత్, బొగ్గు మినహాయించి అన్ని రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ముడి చమురు 3.6 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 2.8 శాతం, సహజవాయువు 7.2 శాతం, ఉక్కు 2.7 శాతం, సిమెంట్ 9.7 శాతం, ఎరువులు 2.9 శాతం ప్రతికూలంగా ఉండగా, విద్యుత్ 4.2 శాతం, బొగ్గు 2.2 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed