- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్య తెలంగాణకు కృషి.. గెజిటెడ్ అధికారుల సంఘం పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది. వైద్యశాఖలో పనిచేసే హెచ్ఓడీల నుంచి కింది స్థాయి కేటగిరీ వరకు రెట్టింపు స్థాయి ఉత్సాహంతో పనిచేస్తే రాష్ట్రం ఆరోగ్యవంతంగా మారుతుందని ఆ సంఘం నాయకులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జూపల్లి రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు పది వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మత్రి హరీష్‌రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అయితే గెజిటెడ్ అధికారులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిందిగా మంత్రి హరీష్‌రావుకు వినతి పత్రాన్ని అందచేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎండీ ఖలీముద్దీన్, అసోసియేటెడ్ అధ్యక్షులు ఎస్ రామాంజనేయులు, కోశాధికారి కె శ్రీనివాసులు, పూజల చంద్రశేఖర్‌రావు, వసంతరావు, విజయ్‌కుమార్, మహమ్మద్ మనోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- harishrao