నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే

by sudharani |   ( Updated:2021-06-04 04:26:41.0  )
నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
X

దిశ,వెబ్‌డెస్క్: నిద్రా.. నిద్రా.. ఏమిరా బాలరాజు ఎప్పుడూ నిద్రపోతుంటావు. యాక్టీవ్ గా లేకున్నా ఎప్పుడూ నిద్ర మబ్బులో ఉంటావ్. నువ్వో మబ్బోడవి’ అని కామెంట్స్ చేస్తుంటాం. అవును ఇప్పుడు అలా కామెంట్స్ చేసేవాళ్ల కంటే అలా అనిపించుకునే వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఉరుకులు, పరుగులు డే అండ్ నైట్ పనిచేస్తున్నామనుకునే వాళ్లంతా భవిష్యత్ లో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటీవల చేసిన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

రోజూ 18 గంటలు పని చేస్తున్నా. నిద్రాహారాలు మాని కష్టపడుతున్నా’ననే వాళ్లు డెఫ్‌నెట్ గా రోగాలు కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు వైద్యులు . కంటికి నిద్ర, ఒంటికి రెస్ట్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి వింటే గుండెలు బరువెక్కడం కాదు.. గుండె ఆగినంత పని’ అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. హాయిగా నిద్ర పోండని ఎవరైనా అంటే నిద్ర పట్టడం లేదని అంటుంటారు. ఇలా గడిచిన కొన్ని సంవత్సరాల్లో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మరి మీరు ఆరోగ్యంతో పాటు బరువు తగ్గాలంటే రాత్రి వేళల్లో నిద్ర పోవడం చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు మనం ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో నిద్రపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ వెలుతురులో ఉండకూడదు

మన శరీరం సిర్కాడియన్ రిథమ్ పై ఆధారపడుతుందన్న విషయం అందరికి తెలిసిందే. సిర్కాడియన్ రిథమ్ అనేది మన మెదడులో జరిగే సహజమైన అంతర్గత ప్రక్రియ. ఇది మనం ఎప్పుడు నిద్ర పోవాలో.. ఎప్పుడు నిద్ర నుంచి మేల్కోవాలో మన మెదడికి సిగ్నల్స్ పంపిస్తోంది. ఆ సిగ్నల్స్‌పైనే మన నిద్ర ఆధారపడుతోంది. అందుకే పగటి పూట ఎక్కువ వెలుతురులో ఉండకూడదని, నార్మల్ వెలుతులోనే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. నార్మల్ వెలుతురు సిర్కాడియన్ రిథమ్ పనితీరు బాగుండేలా చేస్తుంది. దీంతో రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పగటిపూట ఎక్కువ వెలుతురులో గడపడం వల్ల నాణ్యమైన నిద్రలోపించి సుమారు 83శాతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.

కెఫిన్ కి దూరంగా ఉండాలి

కెఫిన్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్నే నష్టాలున్నాయి. అమెరికా మొత్తం పాపులేషన్ లో 90శాతం మంది వివిధ పద్దతుల్లో కెఫిన్ ను శరీరానికి అందిస్తుంటారు. కెఫిన్ వల్ల ఫోకస్ తో పాటు, ఎనర్జీ గా ఉండొచ్చని వివిధ క్రీడలకు చెందిన ఆటగాళ్లు చెబుతుంటారు. అది నిజమే అయినా కెఫిన్ ఎక్కువగా తీసుకోకూడదు. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు బారిన పడాల్సి వస్తుంది. అలాంటి ప్రమాదకరమైన కెఫిన్ ఉన్న పదార్ధాల్ని రాత్రివేళ్లల్లో తీసుకోకూడదు. అలా తీసుకుంటే మన బ్రెయిన్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మన శరీరంలో కెఫిన్ పదార్ధం 6 నుంచి 8గంటల పాటు నిల్వ ఉంటుంది. అందుకే మధ్యాహ్నం 3 నుంచి 4 తరువాత కెఫిన్ ఉన్న పదార్ధాల కు దూరంగా ఉండాలని, లేదంటే నిద్రలేమి సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఒకే సమయంలో పడుకోవాలి

సిర్కాడియన్ రిథమ్ మనం ఎప్పుడు పడుకోవాలి. ఎప్పుడు నిద్రపోవాలో సూచిస్తుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజు ఒకే సమయంలో పడుకోవడం అలావాటు చేసుకోవాలి. అలా పడుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు ఆరోగ్య కరమైన నిద్రకు ఉపక్రమించవచ్చు. లేదంటే నిద్రలేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మద్యం సేవించకూడదు

చాలా మంది రాత్రివేళల్లో మద్యం సేవించే అలవాటు ఉంటుంది. రాత్రి వేళల్లో మద్యం సేవించడం వల్ల నిద్ర తో పాటు హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మీ శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో పాటు హ్యూమన్ గ్రోత్ హర్మోన్ల వృద్దిని తగ్గిస్తుంది.

బెడ్ రూమ్ ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి

మనం పడుకునే పడక గది అందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. గజిబిజి గందరగోళంలా కాకుండా బెడ్ షీట్లు, విండోస్ తో పాటు సువాసనలు వెదజల్లే సుగంద ద్రవ్యాల్ని వినియోగించాలి. బెడ్ రూమ్ లోకి ఎలాంటి శబ్ధాలు వినబడకుండా చూసుకోవాలి. 50శాతం మంది మహిళలు, పురుషులు బెడ్ రూమ్ లో కాంతి తో పాటు శబ్ధాలు లేకపోవడం వల్లే చక్కటి నిద్రపోతున్నట్లు ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.

మెలటోనిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి

మన మెదడులో వినాళ గ్రంథులుంటాయి. ఆ గ్రంథులు మనం రాత్రి పడుకున్నప్పుడు మెలటోనిన్ అనే రసాయనాల్ని విడుదల చేస్తాయి. ఆ రసాయనాలు ఎప్పుడు నిద్ర పోవాలి- ఎప్పుడు మేల్కోవాలో సిగ్నల్ పంపే సైకిల్స్ ను నియంత్రిస్తాయి. తద్వారా తగినంత నిద్రపోవచ్చు. ఆ సైకిల్స్ పై నియంత్రణ లేకపోతే మనం ఎప్పుడు నిద్రపోతున్నామో.. ఎప్పుడు మేల్కొంటున్నామో అర్ధం కాదు. కాబట్టి ఎవరైతే నిద్రసమస్యతో బాధపడేవారు 2ఎంజీ మోతాదులో ఉన్న ట్యాబ్లెట్లను వినియోగించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

బెడ్ రూమ్ లో తగినంత టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి

మనం నిద్రకి బెడ్ రూమ్ వాతావరణం ఎంత ముఖ్యమో, టెంపరేచర్ కూడా అంతే ముఖ్యం. సమ్మర్ సీజన్ లో వేడి వాతావరణంలో చాలా కష్టం. అలాగే మనం పడుకునే బెడ్ రూమ్‌లో వేడి ఉంటే మన నిద్రకి అంతే ఇబ్బంది కలుగుతుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండడం శబ్ధ కాలుష్యం కంటే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. కనీసం బెడ్ రూమ్ లో 20 సెల్సియస్ డిగ్రీల చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల హాయిగా నిద్రపోవచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

Advertisement

Next Story