- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : ఈటల జమునకు అస్వస్థత.. బీజేపీ శ్రేణుల్లో టెన్షన్
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్భన్ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మహిళా ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదంటూ ఆదివారం బీజేపీ నేతలు చేపట్టిన ధర్నాలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అంతకు ముందు రెండు గంటల పాటు బీజేపీ మహిళా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునతో పాటు స్థానిక ఎంపీపీ తడక రాణి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని ఆరోపించారు. సభాధ్యక్షత వహించాల్సిన ఎంపీపీకి కనీసం స్టేజిపైకి పిలవకపోవడమే గాక, సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్న విషయంపై చెప్పే అవకాశం కల్పించలేదని అన్నారు. మహిళా ప్రజాప్రతినిధికి గౌరవం ఇవ్వని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రెండు గంటల పాటు ఎండలో ధర్నా చేయడంతో ఈటల జమున స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను బీజేపీ మహిళా నేతలు ఆస్పత్రికి తరలించారు.