- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెమెరా కన్నుకు చిక్కిన ఐకానిక్ ప్లానెట్స్.. గురు, శని
దిశ, ఫీచర్స్: కొన్ని నెలల కిందట పుణెకు చెందిన 16 ఏళ్ల ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ ప్రథమేష్ జాజు తీసిన చంద్రుని చిత్రాలు అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. మూన్ క్లియర్ పిక్చర్ పొందేందుకు 50 వేలకు పైగా ఫొటోలు తీసిన ఆ యువకుడు.. ప్రస్తుతం ఐకానిక్ గ్రహాలైన శని, బృహస్పతులను క్యాప్చర్ చేసి మరోసారి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.
అందరిలాగే చిన్నప్పటి నుంచి ఆకాశ అద్భుతాలను చూస్తూ పెరిగిన ప్రథమేష్.. 8 ఏళ్ల వయసులోనే ఖగోళంపై మనసు పారేసుకున్నాడు. తను పెరిగేకొద్దీ అంతరిక్షంపైనా ఇష్టం పెరుగుతూ వచ్చింది. అందుకే చిన్నతనంలోనే ఖగోళశాస్త్ర క్లబ్‌లో చేరాడు. ఆన్‌లైన్‌లో ఆస్ట్రో ఫోటోగ్రాఫర్లను చూస్తూ, తన దగ్గరున్న ప్రాథమిక టెలీస్కోప్‌తో విశ్వాన్ని సంగ్రహించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీఎస్‌ఎల్ఆర్ కెమెరాతోనే ఖగోళ చిత్రాలను తీయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన కెమెరాను ‘కెనాన్1300D’కి అప్‌గ్రేడ్ చేశాడు. గ్రహాల ఫొటోలు తీసేందుకు ZWO ASI120MCS లేదా ZWO ASI462MCSని ఉపయోగిస్తాడు.
బృహస్పతి, శని(శాటర్న్) రెండు కూడా ప్రకాశవంతమైన గ్రహాలు కావడంతో ప్రథమేష్ వాటిని ఫొటోలు తీయాలని భావించాడు. ఇందుకోసం జ్యోతిర్విద్య పరిస్థాన అబ్జర్వేటరీ వెళ్లిన ప్రథమేష్.. అతిపెద్ద ‘సెలెస్ట్రాన్ సీ 11 ఎడ్జ్‌హెచ్‌డీ’ టెలీస్కోప్ సాయంతో సదరు గ్రహాలను పరిశీలించాడు. ఉదయం 2:00 గం. తర్వాత బృహస్పతి, శని గ్రహాలతో పాటు కొన్ని నక్షత్రాలు ఒకే రేఖలో కనిపించడంతో వాటిని షూట్ చేశాడు. రెండు గ్రహాలకు సంబంధించి దాదాపు 7,000 – 10,000 చిత్రాలను క్యాప్చర్ చేసి వాటిని PIPP, AUTOSTAKKT, Registax, IMPPG, Adobe Photoshop, Lightroom, Snapseed వంటి సాఫ్ట్‌వేర్‌లో ప్రాసెస్ చేశాడు.
- Tags
- jupiter