భారీ వర్షాలకు మునిగిపోతున్న ఏడుపాయల దుర్గమ్మ గుడి..

by Shyam |   ( Updated:2021-09-27 07:40:06.0  )
edupayala-durgamma
X

దిశ,మెదక్: రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ వనదుర్గా ఆలయం మెదక్ జిల్లా లోని ఏడుపాయల వన దుర్గ గుడి ఇప్పుడు జలదిగ్బంధంలో చిక్కుకుంది. తుఫాన్ కారణంగా ఆదివారం అర్థరాత్రి నుండి దంచికొడుతున్న వర్షానికి సింగూరుకు వరద నీరు చేరుతోంది. దీంతో సింగూరు జలాశయం గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న ఘనపూర్ ప్రాజెక్టు నీటి ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. దాంతో ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల దుర్గామాత పాదాలను తాకుతూ మంజీర నది ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరగడంతో ఆలయాన్ని మూసివేశారు. ఆలయ సమీపాన దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగిపోయాయి.

temple

Advertisement

Next Story

Most Viewed