వైభవంగా ఏడుపాయల్లొ శరన్నవరాత్రి ఉత్సవాలు..

by Shyam |
edupayalu
X

దిశ ,పాపన్నపేట: ఈ నెల 7 నుండి ఏడుపాయల లో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు గోకుల్ షెడ్ ముస్తాబయింది. తొమ్మిది రోజుల పాటు ఏడుపాయల లో అంగరంగ వైభవంగా జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించనున్నారు. ఉత్సవాలు ఈనెల 15వ తేదీ వరకు కొనసాగనుండగా వన దుర్గా భవాని మాత తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమివ్వనుంది. అయితే ప్రతి సంవత్సరం వన దుర్గా భవాని మాత ఆలయంలో మూలవిరాట్ విగ్రహంతో పాటు, గోకుల్ షెడ్ లో ఏర్పాటు చేసే ఉత్సవ విగ్రహాన్ని సైతం ఒకే రూపంలో భక్తులకు దర్శనమిచ్చేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఇటీవల గత 16 రోజులుగా దుర్గామాత ఆలయం ముందునుండి మంజీర ప్రవాహం ఉండడంతో ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే, రాజగోపురం లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడే దర్శనం చేసుకుంటున్నారు. ఆలయం ముందునుండి వరద తగ్గకపోవడంతో శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి మూలవిరాట్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చేవారు రాజగోపురం లోనే అమ్మ వారిని దర్శించుకోవలసి ఉంటుంది.

Advertisement

Next Story