SBI Recruitment 2025:రాత పరీక్ష లేకుండా లక్ష జీతంతో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-03-17 15:33:02.0  )
SBI Recruitment 2025:రాత పరీక్ష  లేకుండా లక్ష జీతంతో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం పొందడానికి ఇది ఒక సువర్ణావకాశం. రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో 273 పోస్టుల భర్తీకి SBI దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలు మేనేజర్ రిటైల్ ప్రొడక్ట్స్, FLC కౌన్సిలర్లు, FLC డైరెక్టర్ల పోస్టులు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టులకు ఈ నెల 21, FLC కౌన్స్‌లర్ అండ్ డైరెక్టర్ పోస్టులకు 26లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. MBA, PGDM, PGPM, MMS పాసై, అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మేనేజర్‌కు రూ.85,920. రూ.1,05,280 FLC కౌన్సెలర్ అండ్ డైరెక్టర్లకు రూ.50,000 ఇస్తారు. ఈ దరఖాస్తులకు ఈ నెల 26 వతేదీన చివరి తేదీగా ప్రకటించారు.

Next Story