- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాసెట్ షెడ్యూల్ రిలీజ్
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టంచేశారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు అప్లికేషన్ కు అవకాశం కల్పించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వ తేదీ వరకు, రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 26 వరకు, రూ.4000 లేట్ ఫీజుతో మే 3వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా లాసెట్ కు గాను ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600గా ఫీజును నిర్ణయించారు.
పీజీఎల్ సెట్ కు గాను ఓపెన్ కేటగిరీకి రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.900 ఫీజు ఉంటుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా తప్పొప్పుల సవరణకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టంచేశారు. మే 25వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.