CBSE: సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే హవా

by GSrikanth |   ( Updated:2023-05-12 06:30:33.0  )
CBSE: సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే హవా
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/ ల ద్వారా తెలుసుకోవచ్చు. సీబీఎస్ఈ ప్రకారం ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 87.33 శాతంగా ఉంది. ఈ ఫలితాల్లో బాలికలదే హవా నడిచింది. బాలికలు 90.68 ఉత్తీర్ణత సాధించగా బాలురు 84.1 ఉత్తీర్ణత సాధించారు. త్రివేండ్రం ప్రాంతం 99.91 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి: CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

ALERT : పింఛన్ దారులకు ఈపీఎఫ్‌వో కీలక సూచన

Advertisement

Next Story

Most Viewed