- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. DPH అండ్ FW/DME విభాగంలో 431(మల్టీ జోన్-1లో 270. మల్టీ జోన్-2లో 161) ఉద్యోగాలున్నాయి. అభ్యర్థులు MBBS పూర్తి చేసి ఉండాలి. IPM డిపార్ట్‌మెంట్‌లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులు. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://mhsrb,telangana,gov.in/ సందర్శించండి. అర్హులైన అభ్యర్థులు రూ. 500 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో ఇవి తప్పనిసరి..
దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు, టెన్త్ మెమో, MBBS కన్సాలిడేటేడ్ మార్క్స్ మెమో, MBBS సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్, 1 నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకెళ్లాలి.