SSC Results 2024 Updates:పదో తరగతి జవాబు పత్రాల వాల్యూయేషన్ షురూ..ఫలితాలు ఎప్పుడంటే?

by Jakkula Mamatha |
SSC Results 2024 Updates:పదో తరగతి జవాబు పత్రాల వాల్యూయేషన్ షురూ..ఫలితాలు ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు.అయితే ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అని విద్యార్థులు వారి పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. జిల్లాల నుంచి సేకరించిన ఆన్సర్ షీట్‌లను అధికారులు స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. అధికారులు జవాబు పత్రాల కోడింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు తెలిపారు.

బుధవారం ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.వాల్యూయేషన్ పూర్తి అయిన తర్వాత రిజల్ట్ ప్రాసెసింగ్‌ మరో రెండు వారాల పాటు కొనసాగుతుంది.వాల్యూయేషన్ అనంతరం పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ పోర్టల్ నుంచి రిజల్ట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed