నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (NEST) - 2023

by Harish |   ( Updated:2023-02-23 13:35:24.0  )
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (NEST) - 2023
X

దిశ, ఎడ్యుకేషన్: సైన్స్, మ్యాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్యను ఆశిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ న్క్రీనింగ్ టెస్ట్.. నెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలో రాణిస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్), భువనేశ్వర్; యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్టీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు.

రూ. 60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ కోసం ఏడాదికి రూ. 20,000 గ్రాంట్ కూడా ఇస్తారు.

పరీక్ష వివరాలు:

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2023

సీట్ల రిజర్వేషన్:

నైసర్ (200 సీట్లు): జనరల్ -101, జనరల్ ఈడబ్ల్యూఎస్-0, ఓబీసీ ఎన్ సీఎల్ - 54, ఎస్సీ - 30, ఎస్టీ - 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరిలో 5 శాతం సీట్లు కేటాయించారు.

సీఈబీఎస్ (57 సీట్లు): జనరల్ - 23 , జనరల్ ఈడబ్ల్యూఎస్ - 6, ఓబీసీ ఎన్‌సీఎల్- 15, ఎస్సీ -9, ఎస్టీ - 4 దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి.

వయసు: ఆగస్టు 1, 2003 తర్వాత జన్మించిన జనరల్, ఓబీసీలు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ట వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులు: ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు

పరీక్ష తేదీ: జూన్ 24,2023.

ఫలితాలు: జులై 10, 2023.

పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

వెబ్‌సైట్: https://www.nestexam.in

ఇవి కూడా చదవండి:

కరెంట్ అఫైర్స్ : 23-02-2023

Advertisement

Next Story

Most Viewed