- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Job Alert:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్..భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ..నేడే లాస్ట్ డేట్
దిశ,వెబ్‌డెస్క్:బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఐబీపీఎస్ 2025–2026 సంవత్సరానికి గానూ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఆగస్టు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 5351 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీగా ఖాళీలున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. వీటిలో 4,455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్, 896 స్పెషలిస్టు ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ గడువును ఇప్పటికే ఒకసారి పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, MBA పూర్తయిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.ibps.in/ సందర్శించండి.