ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

by Harish |   ( Updated:2023-05-08 17:40:35.0  )
ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
X

దిశ, ఎడ్యుకేషన్: విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 14 బీసీ బాల బాలికల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌మీడియట్ (ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మే 18లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

పరీక్ష వివరాలు:

మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023

విద్యార్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదో తరగతి మార్చి 2023 ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదు.

వయసు: ఆగస్టు 31, 2023 నాటికి 17 ఏళ్లు మించరాదు.

ఎంపిక: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

పరీక్ష ఫీజు: రూ. 250 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 18, 2023

ప్రవేశ పరీక్ష తేదీ: మే 28, 2023.

వెబ్‌సైట్: https://mjpapbcwreis.apcfss.in

ఇవి కూడా చదవండి:

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. దరఖాస్తులు ఎప్పుడంటే ?

Advertisement

Next Story

Most Viewed