- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IBPS SO : ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే
దిశ, ఫీచర్స్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్ ఎగ్జామ్ 2023 కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ పరీక్ష 2023లో ఉత్తీర్ణులై మెయిన్ పరీక్ష రాసే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023ని అధికారిక వెబ్‌సైట్ – ibps.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు IBPS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ను ఉపయోగించి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. మెయిన్స్ పరీక్ష 28 జనవరి 2024 న నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం..
ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ విధానం..
ఫలితాలను చెక్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.inకి లాగిన్ అవ్వండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో నవీకరణల లింక్ పై క్లిక్ చేయండి.
దీని తర్వాత ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ పరీక్ష 2023-24 డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
లాగిన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ వంటి ప్రభుత్వ ID ప్రూఫ్ లను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్ (GD సెషన్), ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.