Good News:4660 పోలీస్ ఉద్యోగాలు..రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం

by Jakkula Mamatha |   ( Updated:2024-04-14 14:09:07.0  )
Good News:4660 పోలీస్ ఉద్యోగాలు..రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం
X

దిశ,వెబ్‌డెస్క్:నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆర్​ఆర్​బీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్​లోని 4660 SI, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. RPF లో 4660 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. SI పోస్టులు 452, కానిస్టేబుల్ ఉద్యోగాలు 4,208 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://rpf.indianrailways.gov.in/RPF/ వెబ్‌సైట్ ని సంప్రదించండి.

విద్యార్హతలు:సబ్​-ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం SSLC (10వ తరగతి) చదివి ఉండాలి.

వయోపరిమితి:SI పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు - 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు - 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు ఏజ్​ రిలాక్సేషన్​ ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, ఎక్స్​-సర్వీస్​మెన్​, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ:అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్​ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి అర్హులైన అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు:సబ్​-ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం ఇస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 శాలరీ ఇస్తారు.

Advertisement

Next Story

Most Viewed