పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ ప్రశ్నలకు మార్కులు కలవనున్నాయి!

by Jakkula Mamatha |
పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ ప్రశ్నలకు మార్కులు కలవనున్నాయి!
X

దిశ,వెబ్‌డెస్క్:ఎస్‌ఎస్‌సీ బోర్డు పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ నెల 11వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్‌లో జీవశాస్త్రం సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలు ముగిసినప్పటికీ తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో క్లారిటీ లేకపోవటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వీటిపై తాజాగా SSC బోర్డు స్పందించింది. ఆ పరీక్ష పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.మార్చి 28వ తేదీన బయాలజీ ఎగ్జామ్ జరిగింది.

ఈ సబ్జెక్ట్ లో 2వ సెక్షన్ లోని ఆరో క్వశ్చన్ లో ఇంగ్లీష్ మీడియానికి, తెలుగు మాధ్యమంలో వచ్చిన ప్రశ్న విషయంలో తేడా ఉండటంతో విద్యార్థులు స్పష్టతకు రాలేకపోయారు. దీంతో పలువురు బోర్డు దృష్టికి తీసుకెళ్లాగా..బ్లూ ప్రింట్ విధానానికి విరుద్ధంగా ప్రశ్న ఇచ్చినట్లు తేలింది.దీనిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం..తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన విద్యార్థికి 2 మార్కులు ఇవ్వాలని సూచించారు. ఇక ఇదే రెండో విభాగంలో ఐదో ప్రశ్న విషయంలో దానికి రిలేటెడ్ ఆన్సర్ రాస్తే మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే ఉర్దూ మీడియానికి సంబంధించిన మ్యాథ్స్ పేపర్‌లో తలెత్తిన కొన్ని మిస్టేక్స్ పై కూడా బోర్డు అధికారులు ఎగ్జామినర్లకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed