TSPSC:గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..హైకోర్టు సంచలన నిర్ణయం

by Jakkula Mamatha |
TSPSC:గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..హైకోర్టు సంచలన నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 9వ తేదీన జరగనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 9వ తేదీన జ‌ర‌గ‌నున్న గ్రూప్-1 ప‌రీక్ష‌పై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రూప్-1 ప‌రీక్ష‌ను వాయిదా వేయ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌లేమ‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. జూన్ 9వ తేదిన కేంద్ర‌ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంట‌లిజెన్స్ ఆఫీస‌ర్ గ్రేడ్ 1, ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు స్క్రీనింగ్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. దీంతో రాష్ట్రంలో జ‌రిగే గ్రూప్-1 ప‌రీక్ష‌ను వాయిదా వేసేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాలంటూ ఎం గ‌ణేష్‌, భూక్యా భ‌ర‌త్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన జస్టిస్ పుల్లా కార్తీక్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష వాయిదా వేయ‌డానికి నిరాక‌రించారు. ఈ పరీక్ష కోసం సుమారు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ వివ‌రించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed