డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే జాబ్ మీదే..

by Jakkula Mamatha |
డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే జాబ్ మీదే..
X

దిశ,వెబ్ డెస్క్:చాలా మంది ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతారు. అయిన ఈ అధిక కాంపిటీషన్ లో జాబ్ సాధించాలంటే కత్తి మీద సామే. అందుకే ఈ పోటీ ప్రపంచంలో మరింత అధిక సమయం కేటాయించి ప్రయత్నించాలి.తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ లో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఎంతో మంది కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే జాబ్ కొట్టాలంటే దానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

ఈ టిప్స్ పాటిస్తే DSC జాబ్ మీదే..

డీఎస్సీలో మీరు ఎంచుకున్న సబ్జెక్టులకు అనుగుణంగా ప్రిపరేషన్ ఉండాలంటే మీరు ఇలా చదవాల్సిందే. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను క్షుణంగా చదవాలి.చదివిన ప్రతి దానిని రివిజన్ చేసుకోవాలి. మీరు చదివిన ప్రతి అంశాన్ని ఒక నోట్స్ లో నోట్ చేయాలి.ఇంటర్మీడియట్ స్థాయిలో చదివితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి.జీవశాస్త్రం 20 మార్కులు ఉంటాయి.జీవశాస్త్రం సబ్జెక్టు చదివితే అది జనరల్ స్టడీస్ పేపర్ లో కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది.

వీటితో పాటు ఇతర సబ్జెక్టులను కూడా లోతుగా, ప్రతి క్షుణ్ణంగా చదివితే DSC జాబ్ మీదే! ఏ సబ్జెక్ట్ కు ఎంత సమయం కేటాయించాలో ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ప్రాక్టీస్ తోనే ఏదైనా సాధ్యం అనే విషయం తెలిసిందే. అందుకే మీరు చదివిన ప్రతి అంశాన్ని బుక్ లో రాయండి. టైం దొరికినప్పుడు ఆన్లైన్లో క్లాస్ స్ వినండి. ఏ సబ్జెక్ట్ కు ఎంత వెయిటేజ్ తో మార్కులు ఉన్నాయో తెలుసుకోండి. మీరు ఎందులో ఎంత స్కోర్ చేయగలుగుతున్నారో గమనించండి.మెథడాలజీ అనేది వంద మార్కులకు ఉంటుంది. ఇందులో టెట్ వెయిట్ 20 మార్కులు ఉంటాయి.మిగతా 80 మార్కులు వివిధ సబ్జెక్టుల నుంచి వస్తాయి.

Advertisement

Next Story

Most Viewed