- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APRS CAT - 2023 నోటిఫికేషన్ విడుదల
దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 134 ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలు, ఆరు,ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించిన ఏపీఆర్ఎస్ క్యాట్ -2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను మే 20న నిర్వహించనున్నారు.
వివరాలు :
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023
క్లాసులు: 5,6,7,8 తరగతులు.
50 పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు: 3,920
84 పాఠశాలల్లో 6,7,8 తరగతుల సీట్లు: 356
అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో 5,6,7,8 తరగతులకు ప్రవేశం పొందడానికి వరుసగా 4,5,6,7 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదు.
దరఖాస్తు :ఆన్‌లైన్ లో చేయాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరి, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100 చెల్లించాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023.
పరీక్ష తేదీ: మే 20, 2023.
వెబ్‌సైట్: https://aprs.apcfss.in