AP LAWCET, PGLCET - 2023 నోటిఫికేషన్ విడుదల

by Harish |
AP LAWCET, PGLCET - 2023 నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 -24 విద్యా సంవత్సరానికి మూడేళ్ల, ఐదేళ్ల ఏపీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్-2023), ఏపీ పీజీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీ లాసెట్- 2023) నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఎల్ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీనిని గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.

ఎగ్జామ్ వివరాలు :

ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ - 2023

కోర్సు: మూడు, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు.

అర్హత: మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉండాలి.

ఐదేళ్ల ఎల్ఎల్‌బీకి ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి.

ఎల్ఎల్ఎం కోర్సుకు ఎల్ఎల్‌బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.

మీడియం: లాసెట్ ఇంగ్లీష్/తెలుగులో ఉంటుంది.

పీజీఎల్ సెట్ పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అప్లికేషన్ ఫీజు:

లా సెట్ అప్లికేషన్ ఫీజు: రూ. 900 (బీసీలకు రూ. 850, ఎస్సీ/ఎస్టీలకు రూ. 800)

పీజీఎల్‌సెట్ అప్లికేషన్ ఫీజు: రూ. 1000, బీసీలకు రూ. 950, ఎస్సీ/ఎస్టీలకు రూ. 900.

దరఖాస్తు ప్రారంభం: మార్చి 23, 2023 నుంచి

చివరి తేదీ: ఏప్రిల్ 22, 2023.

లేట్ ఫీజుతో చివరి తేదీలు: ఏప్రిల్ 29, మే 5, మే 9/2023.

హాల్‌టికెట్ డౌన్‌లోడ్: మే 15, 2023.

పరీక్ష తేదీ: మే 20, 2023.

వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in

Next Story

Most Viewed