- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Heavy Rain Alert:అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మళ్లీ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో, తూర్పు-పశ్చిమ గాలి విచ్చిన్నతిలో కేంద్రీకృతమై, మధ్య ట్రోపోస్పియర్ స్థాయిల వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం (సెప్టెంబర్ 23) వాయువ్య మరియు దాని పరిసర పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో కొన్ని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 29 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురం భీమ్, మెదక్, మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి జిల్లాలో మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉంటుందని నిర్ధారించింది. ఆదివారం మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా.. హైదరాబాద్‌ను భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. శనివారం సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో గ్యాప్‌లు వారీగా దంచికొట్టిన వానతో నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్లు పారడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.