- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. ఇంటిబాట పట్టిన విద్యార్థులు
దిశ, ఖమ్మం: తెలంగాణలో రెండో దఫా కరోనా వైరస్ విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకున్నది. తెలంగాణలోని పల్లు జిల్లాలో ఉన్న విద్యార్ఠులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రవేట్, ప్రభుత్వ పాఠశాలలను మాసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రవైట్ పాఠశాలను మూసివేసేందుకు జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి పాఠాశాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్ఠులు ఇంటిబాట పట్టారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు వచ్చి వారి వెంట తీసుకెళ్లారు. విద్యార్థులు ఇంటివద్ద ఉండి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులను సూచించారు. విద్యార్థులు వారి వారి ప్రాంతాలకు వెళ్లడంతో ప్రయాణికుల ప్రాంగణాలు కిటకిటలాడాయి.
పాఠశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారులు..
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలను తనిఖీలు చేశారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలను తప్పని సరిగా మూసివేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఖమ్మం నగరంలో ఉన్న శ్రీచైతన్య, కృష్ణవేణి, హార్వెస్ట్ తదితర పాఠశాలను తనిఖీలు చేశారు. హాస్టల్ ఉన్న విద్యార్థులను ఇంటికి పంపించారు. పాఠశాలను నడిపిస్తే తగు చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖదికారి పాఠశా యాజమాన్యాలకు హెచ్చరించారు. ప్రతి రోజు తనిఖీ చేపడతామని సూచించారు. అన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు చేశారు.