- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ వాక్: ఆసియా ఆహార భద్రతకు రష్యా భరోసా!
ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం పడగవిప్పి నాట్యం చేస్తున్నది. ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 'గ్రెయిన్ డీల్'లో భాగంగా ఐక్యరాజ్యసమితి రష్యా ఆహార ధాన్యాల ఎగుమతులు, దిగుమతులుపై సడలింపు ఇచ్చింది. అయితే, ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన ఆహార ధాన్యాలు, ఎరువులు, పాలిమర్ ఉత్పత్తులను ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా తాను అభివృద్ధి చెందడంతో పాటు, ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నది.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార భద్రత పెను సవాలుగా మారింది. అనేక దేశాలు ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, సరఫరా, వినిమయ లోపాలు, ఆంక్షలు వలన అందరికీ ఆహారం అందించలేకపోతున్నారు. 'అంతర్జాతీయ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఫ్‌పీఆర్ఐ)' నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17 శాతం ఆహార ధాన్యాల వ్యాపారానికి ఆంక్షలు ఆటంకం కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాపై యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. పామాయిల్ విషయంలో ఇండోనేషియాపై, బీఫ్ విషయంలో అర్జెంటీనాపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఆహార పదార్థాల లభ్యత ఉన్నా ఇటువంటి ఆంక్షల వలన వినియోగదారులకు అవి అందుబాటులోకి రాలేకపోతున్నాయి. ఫలితంగా సరఫరా గొలుసు దెబ్బతింటూ పలు దేశాలను ఆకలి, పోషకాహార లోపం వెంటాడుతూనే ఉంది.
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం పడగవిప్పి నాట్యం చేస్తున్నది. ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 'గ్రెయిన్ డీల్'లో భాగంగా ఐక్యరాజ్యసమితి రష్యా ఆహార ధాన్యాల ఎగుమతులు, దిగుమతులుపై సడలింపు ఇచ్చింది. అయితే, ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన ఆహార ధాన్యాలు, ఎరువులు, పాలిమర్ ఉత్పత్తులను ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా తాను అభివృద్ధి చెందడంతో పాటు, ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నది. ఐక్యరాజ్యసమితి 'ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ' నివేదిక ప్రకారం గత ఆగస్టు నాటికి, ఆహార ద్రవ్యోల్బణం 130 పాయింట్లు పెరిగింది. దీన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలి.
Also read: మనం చేసే వృథా ఆహారం విలువెంతో తెలుసా?
ఇవి కూడా కీలకమే
కెమికల్ ప్రొడక్ట్స్ కూడా ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని మరువరాదు. ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాష్ వంటివి పంట దిగుబడిని పెంచేందుకు సహకరిస్తాయి. ఫుడ్ కెమిస్ట్రీ, పెట్రో కెమికల్ పరిశ్రమలు కూడా ఆహార పదార్థాలు నిల్వ ఉంచుటలో, ఫుడ్ ప్యాకేజింగ్ ద్వారా వృథాను అరికట్టేందుకు సహాయపడతాయి. గ్రెయిన్ డీల్ ద్వారా రష్యా ఎరువులను కూడా ఎగుమతి చేయవచ్చు. కానీ అలా జరగుటలేదు. నిజానికి సుమారు 15 శాతం శాతం ఎరువులు రష్యా నుంచే లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. దీంతో పలు దేశాలలో రైతులు పంట దిగుబడి పెంచుతూ ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఆంక్షల నేపథ్యంలో రష్యా తన ఎరువులను ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తూ ఈ ప్రాంతంలో పంట దిగుబడిని పెంచేందుకు, ఆహార పదార్థాలు అధిక ఉత్పత్తికి చేయూతనిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో రైతులు ఎరువులను అధికంగా వాడి అధిక ఉత్పత్తి సాధిస్తున్నారు. రష్యా ఎరువులను ఎనిమిది రెట్లు వాడుతున్నారు. ఫాస్ఫేట్‌లో భారత్‌కు రష్యా అతిపెద్ద ఎగుమతిదారు.
ప్యాకేజింగ్ కూడా ముఖ్యమే
ఇక ఆహార భద్రతలో 'ప్యాకేజింగ్' ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పంట కోత కాలం నుంచి దుకాణాలకు చేరే వరకు ఇదే కీలకం. కొన్ని నివేదికల ప్రకారం ఆహార ధాన్యాల సరఫరా కాలంలో సుమారు 20 శాతం శాతం, తినకుండా పాడేసే ఆహారం 25 శాతం వృథా అవుతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఏఓ అంచనా ప్రకారం యేటా 400 బిలియన్ అమెరికన్ డాలర్‌ల విలువ చేసే ఆహారం వృథా అవుతున్నది. 4.4 గిగా టన్నుల కార్బన్ డై ఆక్సయిడ్ ఉత్పత్తి అవుతోంది. చైనా, అమెరికా తరువాత అంతటి కాలుష్యం ఈ ఆహార వృథా వలననే జరుగుతోంది.
పంటలను నిల్వ ఉంచడానికి, వినిమయానికి వివిధ రకాల పాలిమర్స్ వాడతారు. వృథాను అరికట్టేందుకు పాలిమర్ ప్యాకేజీ ఎంతో తోడ్పడుతుంది. పాలిమర్ ఉత్పత్తిలో రష్యాలోని 'సిబర్' కంపెనీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది. రష్యా నుంచి ఎగుమతి అయ్యే పాలిమర్ పైనా ఈయూ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఈ ఉత్పత్తులను కూడా ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది. యూరప్ దేశాలకు 42 శాతం పాలిమర్ రష్యా నుంచే ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం ఆ అవకాశాలు లేకుండా పోయాయి.
Also read: యూకే పీఎంగా మన యువ రిషీ సునక్
మన మార్కెట్ కూడా పెద్దదే
పాలిమర్ ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెటే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు యేటా సగటున 28 కేజీల పాలిమర్ వాడుతున్నారు. మన దేశంలో 9.7 కేజీలు మాత్రమే వాడుతున్నారు. చైనాలో 45 కేజీల పాలిమర్ ఉత్పత్తులు వాడుతూ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారు. ప్లాస్టిక్ వినియోగం మంచిది కాదనే విషయం అందరూ గ్రహించాలి. రష్యా కంపెనీ 'సిబర్' తాను తయారుచేసే పాలిమర్ ఉత్పత్తులను తిరిగి పునరుత్పత్తి చేసే విధంగా ( పీఈటీ) గ్రాన్యూల్స్‌తో తయారు చేస్తుంది. వీటితో 30 శాతం తిరిగి రిసైక్లింగ్ చేయవచ్చు. 2021లో 'దావోస్'లో జరిగిన 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం' లో 'నెట్ జీరో' బేస్‌డ్ ఉత్పత్తులను తయారు చేయడానికి వివిధ రకాల ఒప్పందాలు జరిగాయి. దీనిలో భాగంగానే సిబర్ కంపెనీ గ్రీన్ పోలిత్రిన్ టెరిపిథిలేట్ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా రష్యా ఆపత్కాలంలో కూడా నాటో, ఈయూ, యూరప్ దేశాలు అనేక ఆంక్షలు విధించినా, దేనికీ భయపడకుండా, సమయోచితంగా, తన ఆహార ధాన్యాలను, ఎరువులను, చమురును, పాలిమర్ ఉత్పత్తులను ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నది. తాను ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే అనేక దేశాలలో ఆహార కొరత రాకుండా భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది.
ఐ.ప్రసాదరావు
63056 82733