Drug Mafia: తెలంగాణపై డ్రగ్స్ పంజా

by Ravi |   ( Updated:2022-12-29 18:31:02.0  )
Drug Mafia: తెలంగాణపై డ్రగ్స్ పంజా
X

హైదరాబాద్ అడ్డాగా యేటా జరుగుతున్న డ్రగ్స్ వ్యాపార విలువ అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు అంటే నమ్మశక్యం కాదేమో! కానీ ఇది నిజం. నగరానికి వివిధ మార్గాలలో వచ్చి చేరుతున్న ఈ మాదక ద్రవ్యాలు యువత జీవితాలను చిత్తుచేయడమే కాక, ఈ జాడ్యం ఇతర స్కూళ్లకు సైతం పాకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయనే వార్త మరింత ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే ఇలా చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు చివరికి బానిస గా మార్చుతుంది. డ్రగ్ అలవాటయ్యాక దీనికోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనకాడరు. మత్తుకి బానిసై స్నేహితులు, బాంధవ్యాలను వదిలేసి ఒంటరిగా కుంగిపోయి చివరకు ఇది ఆత్మహత్యలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దో నిశ్శబ్ద మహమ్మారి.. బడీడు పిల్లల నుంచి హోదా ఉన్న ప్రముఖుల దాకా మత్తుగా మింగేస్తున్న డ్రగ్స్ రక్కసి. సరదా అంటూ మొదలెట్టి దానికి బానిసై వదలలేక చిత్తయిన బతుకు లెన్నో.. ఒళ్ళు గుల్ల బారిపోయి చావలేక బతకలేక జీవచ్ఛవాలుగా గడుపుతున్న వారెందరో. ఇక్కడా అక్కడా అని కాదు, ఇప్పుడు అప్పుడు అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల భూతం పంజా విసురుతూనే ఉంది.

అక్కడి నుంచి సరఫరా అవుతూ

ఈ రోజులలో యువత డ్రగ్స్ వలయంలో కూరుకుపోతుంది. సరదాగా సిగరెట్లు, మద్యం అంటూ మొదలెట్టిన వ్యసనం చివరకు మాదకద్రవ్యాల వరకు విస్తరించింది. ఎక్కువగా యువత గంజా కొడితే ఎలా ఉంటుందోననే ఉత్సాహంతో మొదలెట్టి బానిసలయ్యేవారే ఎక్కువమంది. ప్రస్తుతం ఏ వేడుకలో చూసిన డ్రగ్స్ సేవించడం సర్వసాధారణమైంది. అయితే ఎక్కువగా దీనికి బానిసైన వారు కళాశాల విద్యార్థులే. అలాగే అనేక నేరాలలో నిందితులైన వారు ఎక్కువగా డ్రగ్ సేవికులే. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతున్నాయనే అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి బానిసైన యువత అవసరమైన డబ్బు కోసం దొంగలుగా మారుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఈ డ్రగ్స్ కల్చర్ నగరాలు గ్రామాల వరకు విస్తరించింది. వీటి దందా స్కూళ్ళు, కళాశాలలు, యూనివర్సిటీలు, పబ్బులే కాక కాఫీ షాపులలో దొరికే పరిస్థితి ఏర్పడింది.

హెరాయిన్, కొకైన్, ఓపియం, గంజాయి వంటివి యువతను మత్తుకు బానిసను చేస్తుంది. దీనికి అలవాటు పడినవారు సమయానికి తగిన మోతాదులో డ్రగ్స్ తీసుకోకపోతే పిచ్చెక్కిపోతున్న సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు పోలీసులు ఎక్కువగా స్కూళ్ళు, కాలేజీలలో డ్రగ్స్ వాడకంపై దృష్టి సారించడంతో డ్రగ్స్ పెడలర్స్ కాఫీ షాపుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా నిఘా వ్యవస్థల కళ్ళు గప్పి మాదకద్రవ్యాల ముఠాలు వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. కొందరు విదేశీ యువకులు విజిట్ వీసాను అడ్డం పెట్టుకుని మనదేశానికి వచ్చి స్నేహం పేరుతో వలవేసి చివరకు డ్రగ్స్‌కు వారిని బానిసలుగా చేయడమే కాక వారి ద్వారానే డ్రగ్స్‌ మనదేశంలోకి రవాణా చేయిస్తున్నారు.

మరో పంజాబ్ గా మారుతుందేమో

హైదరాబాద్ అడ్డాగా యేటా జరుగుతున్న డ్రగ్స్ వ్యాపార విలువ అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు అంటే నమ్మశక్యం కాదేమో! కానీ ఇది నిజం. నగరానికి వివిధ మార్గాలలో వచ్చి చేరుతున్న ఈ మాదక ద్రవ్యాలు యువత జీవితాలను చిత్తుచేయడమే కాక, ఈ జాడ్యం ఇతర స్కూళ్లకు సైతం పాకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయనే వార్త మరింత ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే ఇలా చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు చివరికి బానిస గా మార్చుతుంది. డ్రగ్ అలవాటయ్యాక దీనికోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనకాడరు. మత్తుకి బానిసై స్నేహితులు, బాంధవ్యాలను వదిలేసి ఒంటరిగా కుంగిపోయి చివరకు ఇది ఆత్మహత్యలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాల వినియోగం పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు డ్రగ్స్ సరఫరాపై ఎప్పటికీ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. దీనిని ఇప్పటికైనా అరికట్టకపోతే తెలంగాణ మరో పంజాబ్ గా మారుతుందనే ఆందోళన తెలంగాణ సమాజం వెళ్లబుచ్చింది. సమాజ అభివృద్ధి లో యువత పాత్రే కీలకం. అందుకే అలాంటి విద్యార్థులకు తరగతి గదిలోనే లోనే డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పెద్ద మొత్తంలో డి-అడిక్షన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి యువతతో తల్లిదండ్రులతో అనునిత్యం సంప్రదిస్తూ డ్రగ్స్ పై అవగాహన కల్పించాలి. విద్యాసంస్థల యాజమాన్యాలు పోలీస్ వ్యవస్థ, టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు నిత్యం సరఫరా ను పర్యవేక్షణ చేస్తూ వీటి వినియోగాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.

దేవేందర్ ముంజంపల్లి

జర్నలిజం పరిశోధక విద్యార్థి , కాకతీయ యూనివర్సిటీ

89784 58611

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed