- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ గెలుపుపై ఇంత ఆక్రోశమా?
అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చునే వ్యక్తి ఆలోచనలతో ప్రపంచ రాజకీయ దిశ మారుతుందని చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకు కారణాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా రాజకీయాలను శాసించే అధ్యక్షుడు సమర్ధుడు, స్థిర చిత్తుడు దృఢ చిత్తుడు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని అమెరికాలోని దేశభక్తి కలిగిన ఓటర్లు గుర్తించారు. అందుకే ట్రంప్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే, మీడియా హౌస్‌లు, పేపర్లు, ఛానళ్లు ఇంటర్నెట్ సైట్లు మొత్తంగా ప్రజా తీర్పు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు అనుకూలంగా ఉందని ఊదరగొట్టాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వాటి నిజస్వరూపం బట్టబయలైంది.
కమలా హారిస్ భారతీయ సంతతికి చెందిన మహిళ అని, ఈ ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే-భారతీయ వలసదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారని, హెచ్‌వన్‌బి వీసాల జారీలో నిబంధనలు కఠిన తరమవుతాయని డెమొక్రటిక్ పార్టీ చేతుల్లోని లెఫ్ట్ మీడియా చేసిన ప్రచారాన్ని భారతీ య అమెరికన్ ఓటర్లు విశ్వసించలేదని ఈ ఎన్ని కల ఫలితాలు తెలియజేస్తున్నాయి. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయ సంతతికి చెందినప్పటికీ, ఆమెకు గానీ, ఆమె కూతురు కమలా హారిస్‌కు గానీ భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల, భారతీయ జీవన విలువల పట్ల సదాభిప్రాయం లేదనే విషయం తెలిసిందే. భారతీయ అమెరికన్లకు కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 ఆర్టికల్ రద్దు విషయంలో మోడీ ప్రభుత్వంపై భారతదేశ భద్రతకు వ్యతిరేకంగా జో బైడెన్, కమల హారిస్ ద్వారా నడపబడే డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం నోరు పారేసుకోవడం, బంగ్లాదేశ్ లోని హిందువులపై జరిగిన మారణకాండను డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్ ఖండించకపోవడం, అదే సమ యంలో భారతీయులు తనకు అత్యంత ఆప్తులని, బాంగ్లాదేశ్‌లో హిందువులపైన జరిపిన దాడులను తాను ఖండిస్తున్నట్లు ట్రంప్ చెప్పిన మాటలను భారతీయ అమెరికన్ ఓటర్లు బాగా నమ్మారు.
ఓటర్ల తీర్పుపై ఇంత అక్కసా?
ఇక ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేని భారతదేశంలోని లెఫ్ట్ మీడియా, మోడీ వ్యతిరేక మీడియా, విదేశీ ఎన్జీవోల ఆర్థిక సహకారం అందుతున్న సంస్థలు తప్పుడు వ్యాఖ్యలతో వ్యాసాలు రాయడంలో తలమునకలై ఉన్నాయి. అమెరికా ఓటర్ల నిర్ణయం అమాయకమని, అనాగరికమని, అమెరికా దేశ ప్రజాస్వామ్యం గజిబిజిగా ఉందని వాపోవడంలో దాగి ఉన్న మర్మం ఏమిటి అని దేశ హితాన్ని కోరే భారతీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు. సహజంగా ఏ దేశ ఓటర్లైనా ఆ దేశ భద్రతను, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, తగిన పార్టీని, తగిన అభ్యర్థిని ఎన్నికల్లో ఎన్నుకుంటారు. అమెరికన్ ఓటర్ల నిర్ణయం ఆ దేశ భద్రతకు అనుకూలంగా ఉంది. ఈ విషయంలో భారతదేశంలోని మీడి యా ప్రతినిధులు ఆక్రోశం, ఆందోళన ఎందుకు వ్యక్తం చేస్తున్నట్లు? భారతదేశంలో మే నెలలో లోక్‌సభకు జరిగిన ఎన్నికలను, నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను పోలు స్తూ, ఇండియాలో మోడీని గెలిపించిన ఓటర్లూ, అమెరికాలో ట్రంప్‌ను గెలిపించిన ఓటర్లూ ఒకే కోవకు చెందిన అనాగరికులని దుర్వ్యాఖ్యలు చేయడంలో బిజీగా ఉన్న వారి మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
మూడోసారి గెలుపు కూడా గిట్టదా?
అమెరికన్ ఓటర్ల నిర్ణయాన్ని అట్లా ఉంచితే, మూడవసారి మోడీ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడంలో ఈ దేశ హితాన్ని కోరే ఓటర్లు ఎంతో నిబద్ధతను, నిజాయితీని, హేతు బద్ధతన ప్రదర్శించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుం దని, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వబడుతున్న రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని, నిమ్నవర్గాలపై దాడులు పెరుగుతాయని ఇలా అనేక తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ నాయకులూ, దాని మిత్రపక్షాల నాయకులు చేసినప్పటికీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి అధికారం అందని ద్రాక్ష పండులా మిగిలిపోయింది. పైగా ఇండియా కూటమి అనేక ఉచిత పథకాల హామీలను ఓటర్ల ముందు ఉంచింది. పైగా కుల విభజన చేసి, కులాల వారిగా రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఊదరగొట్టింది. అయినప్పటికీ ఆ కూటమిని భారతీయ ఓటర్లు తృణీకరించారు.
గెలుపుపై అవాకులు చవాకులు పేలొద్దు!
వాస్తవంగా హిందుత్వమే జాతీయ విధానంగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలు, క్రైస్తవులు, కుల పిచ్చి ముదిరిన హిందువులు సంఘటితమవుతారు. ఈ ఎన్నికల్లో అదే జరిగింది. కాబట్టి ఇండియా కూటమికి 230 సీట్లు వచ్చాయి. కుల పరంగా విడిపోయిన హిం దూ సమాజం ఓటర్లను నమ్ముకుని, మూడవసారి బీజేపీకి 240 సీట్లు సాధించి, మిత్రపక్షాల సహా యంతో అధికారంలోకి రావడం ఆషామాషీ విషయం కాదు. ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే, 2019కీ 2024కు 0.6 శాతం ఓట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసంతోనే 63 లోక్‌సభ సీట్లను కోల్పోయింది. ఒకప్పుడు దేశాన్ని తిరుగులేని అధికారంతో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయిందనే విష యాన్ని మోడీ వ్యతిరేక మీడియా దాచిపెట్టడం మీడియా పక్షపాతానికి ప్రబల నిదర్శనం. ఇక చివరగా శత్రువు మిత్రుడు శత్రువు అనే చాణుక్య నీతిని మనదేశంలోని మోడీ వ్యతిరేకులు బాగా వంట పట్టించుకుని, ట్రంప్ గెలుపుపై అవాకులు చవాకులు పేలడం, అమెరికా ఓటర్ల నిర్ణయాన్ని తప్పు పట్టడం సంస్కార హీనతగా, బుద్ధిహీనతగా పరిగణించబడుతుంది.
ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877